Veera Simha Reddy 12 Days Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లోని అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. హనీ రోజ్, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ టాక్ సంపాదించిన నేపథ్యంలో కలెక్షన్స్ కూడా భారీ ఎత్తున నమోదు అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే రెండు వారాంతాలు పూర్తిచేసుకుని మూడవ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా కలెక్షన్స్ లో మాత్రం భారీ డ్రాప్ కనిపించింది. ఇప్పటికే ఈ సినిమా విడుదలై తెలుగులో పన్నెండు రోజుల ధియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా 12 రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో 63 కోట్ల 55 లక్షల షేర్, 102 కోట్ల 87 లక్షల గ్రాస్ వసూలు చేసింది.


12వ రోజు 11 రోజు తో పోలిస్తే వసూళ్లలో దారుణమైన డ్రాప్ కనిపించింది, 11వ రోజు ఆదివారం కావడంతో కోటి 44 లక్షలు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేస్తే 12వ రోజు సోమవారం అయిన కారణంగా 16 లక్షల మాత్రమే వసూలు చేసింది. ఇక వీర సింహారెడ్డి సినిమా కర్ణాటక సహా మిగతా భారతదేశం అంతా కలిపి 12 రోజులకు గాను నాలుగు కోట్ల 76 లక్షలు వసూలు చేస్తే ఓవర్సీస్ లో ఐదు కోట్ల 71 లక్షలు వసూలు చేసింది.


అలాగే ప్రపంచవ్యాప్తంగా 74 కోట్ల 2 లక్షల షేర్, 124 కోట్ల 51 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 73 కోట్ల రూపాయలకు జరుపుకోవడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా 74 కోట్లు నిర్ణయించారు. ఇక ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమా 2 లక్షల లాభాల్లో ఉంది. అయితే రేపటి నుంచి పఠాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున థియేటర్లు ఆ సినిమాకు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వసూళ్లలో భారీ డ్రాప్ అయితే కనిపించే అవకాశం కూడా ఉంది.


Also Read: Balakrishna Akkineni thokkineni : అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై నాగ చైతన్య కౌంటర్.. బాలయ్యకు దిమ్మతిరిగేలా పోస్ట్


Also Read:  Akkineni Fans: మీ అహంకార, కుల మత్తు మాటలు కట్టిపెట్టి అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook